Pooja: 24 గంటల్లో రెండోసారి హ్యాక్ అయిన యూనివర్సిటీ వెబ్‌సైట్!

  • మరోమారు హ్యాకైన జామియా యూనివర్సిటీ వెబ్‌సైట్
  • పునరుద్ధరించిన అధికారులు
  • హ్యాకర్ పూజ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడని అనుమానం

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వెబ్‌సైట్ మరోమారు హ్యాక్ అయింది. 24 గంటల్లో ఇది రెండోసారి. తొలిసారి హ్యాక్ చేసినప్పుడు ‘హ్యాపీ బర్త్ డే పూజ’ అని పెట్టిన హ్యాకర్లు, ఈసారి ‘క్షమించండి, నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు-పూజ’ అని పెట్టారు. తొలుత మంగళవారం తెల్లవారుజామున వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయగా, సాయంత్రం రెండోసారి హ్యాక్ చేశారు. హ్యాక్‌కు పాల్పడింది ఎవరన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ గ్రూపూ ప్రకటన చేయలేదు.

వెబ్‌సెట్ హ్యాక్‌పై స్పందించిన యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతూ, ఈ ఉదయం యూనివర్సిటీ ప్రారంభం కావడానికి చాలాముందే వెబ్‌సైట్‌ను పునరుద్ధరించినట్టు యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సైమా తెలిపారు. ప్రస్తుతం సైట్ పనిచేస్తోందని పేర్కొన్నారు. కాగా, సైట్‌ను హ్యాక్ చేసింది ఎవరో పూజ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడని, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే హ్యాక్ చేసి ఇటువంటి మెసేజ్‌లు పెడుతున్నాడని ట్విట్టర్‌లో కామెంట్లు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News