Jyotula Nehru: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటీ దాడులు!

  • జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల
  • ఆయన ఇంటిపై నిన్న ఐటీ దాడులు
  • గ్రామంలోని పలువురి ఇళ్లపై కూడా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆపై టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఆదాయపుపన్ను శాఖ దాడులు చేసింది. విశాఖపట్నానికి చెందిన అధికారులు ఆయన స్వగ్రామమైన ఇర్రిపాకలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇదే గ్రామంలో పలువురి ఇళ్లపైనా దాడులు జరిగాయి. దీనికి సంబంధించిన వివరాలను ఈ మధ్యాహ్నం వెల్లడిస్తామని ఐటీ వర్గాలు తెలిపాయి.  

Jyotula Nehru
Jaggampet
East Godavari District
  • Loading...

More Telugu News