Ramdas Athawale: మోదీ ఉండగా రాహుల్ ప్రధాని కావడం అసాధ్యం: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే

  • మరో 15 ఏళ్లు మోదీ హవా కొనసాగుతుంది
  • అప్పటి వరకు రాహుల్ పీఎం కాలేరు
  • మాయావతి బీజేపీకి మద్దుతు ఇవ్వడం మేలు

దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ హవా కొనసాగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడం అసాధ్యమని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే తేల్చి చెప్పారు. మోదీ హవా మరో పది పదిహేనేళ్లు కొనసాగుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో మోదీ ప్రభావం ఉంటుందని అన్నారు.

 సమాజంలోని అన్ని వర్గాలను మోదీ ముందుకు తీసుకెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. బీఎస్పీ నేత మాయావతి బీజేపీకి మద్దతు ప్రకటించడంతో దళితులకు ఎంతోకొంత మేలు చేయవచ్చని అథవాలే సూచించారు. డెహ్రాడూన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Ramdas Athawale
BJP
Narendra Modi
Rahul Gandhi
  • Loading...

More Telugu News