BJP: బండారు దత్తాత్రేయ కుటుంబంలో విషాదం.. గుండెపోటుతో ఏకైక కుమారుడి హఠాన్మరణం!

  • రాత్రి భోజనం చేస్తుండగా గుండెపోటు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి
  • తల్లడిల్లుతున్న కుటుంబం

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో మరణించాడు. మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు మృతి చెందాడు. వైష్ణవ్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు తెలిపారు. వైష్ణవ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో దత్తాత్రేయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలిసిన పలువురు నేతలు దత్తాత్రేయను పరామర్శిస్తున్నారు.

BJP
Bandaru Dattatreya
Hyderabad
Vaishnav
  • Loading...

More Telugu News