Nara Lokesh: మిత్ర ధర్మానికి వెన్నుపోటు పొడిచారు: మంత్రి లోకేశ్‌

  • రాష్ట్ర విభజన మనం కోరుకున్నది కాదు
  • రాష్ట్రానికి మేలు జరుగుతుందనే బీజేపీతో పొత్తు
  • నాలుగేళ్లు మనం చాలా ఓపిక పట్టాం 
  • మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారు

రాష్ట్ర విభజన మనం కోరుకున్నది కాదని, విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని ఏపీ మంత్రి లోకేశ్‌ అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ధర్మ పోరాట బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ... మిత్ర ధర్మానికి బీజేపీ నేతలు వెన్నుపోటు పొడిచారని అన్నారు. నాలుగేళ్లు మనం చాలా ఓపిక పట్టామని అన్నారు. మొదటి ఏడాది ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, రెండో ఏడాది ఇదిగో ఇస్తున్నాం అన్నారని, మూడో ఏడాది ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని, ఏపీకి ప్యాకేజీ ఇస్తామన్నారని తెలిపారు. చివరగా నాలుగో ఏడాది మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన వల్ల ఏపీలో లోటు బడ్జెట్‌ ఉందని, అయినప్పటికీ అన్నింటినీ అధిగమించి చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News