stock markets: ఐదు రోజలు నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- లాభాలతో మొదలైన మార్కెట్లు
- 30 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- నిఫ్టీ 20 పాయింట్లు అప్
వరుసగా ఐదు సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం 50 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్... ఆ తర్వాత ఒకానొక దశలో 120 పాయింట్ల వరకు పెరిగింది. అయితే, చివర్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో లాభాలు తగ్గిపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 34,651కు చేరింది. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 10,537 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్ట్రైడ్స్ షాసూన్ లిమిటెడ్ (15.01%), పీపీ జువెల్లర్స్ (14.93%), బలరాంపూర్ చీనీ మిల్స్ (11.29%), ఎన్సీసీ (9.53%), జైప్రకాశ్ అసోసియేట్స్ (9.15%).
టాప్ లూజర్స్:
సింఫనీ (-11.23%), మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (-6.07%), ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ (-4.49%), పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (-4.40%), జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ (-3.52%).