modi: ‘మోసకారి మోదీ 4 ఏళ్ల రాక్షస పాలన’ పోస్టర్ ఇది: రఘువీరారెడ్డి

- మోదీ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అబద్ధాలు చెప్పారు
- అవినీతి, మోసాలే కాకుండా ప్రజలను వంచించారు
- దీనిని నిరసిస్తూ ఈ నెల 26న రణ శంఖారావం నిర్వహిస్తాం
ప్రధాని నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అబద్ధాలు చెప్పారని, అవినీతి, మోసాలకు పాల్పడటమే కాకుండా ప్రజలను వంచించారని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరాభవన్ లో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు, పున్నర్నిర్మాణ చట్టంలోని అంశాలను అమలు చేయకుండా ద్రోహం చేశారని, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడితే సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు.
