Sania Mirza: ప్రకటన నుంచి వెంటనే తప్పుకో: సానియా మీర్జాకు సీఎస్ఈ అల్టిమేటం

  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పౌల్ట్రీయాడ్ లో సానియా
  • రోల్ మోడల్ గా ఉంటూ... తప్పుడు యాడ్ లో నటించవద్దన్న సీఎస్ఈ
  • అవసరమైతే యాడ్ ను మళ్లీ రూపొందించాలంటూ సూచన

పౌల్ట్రీ అడ్వర్టైజ్ మెంట్ నుంచి వెంటనే తప్పుకోవాలంటూ టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) అల్టిమేటం జారీ చేసింది. అడ్వర్టైజ్ మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) నిబంధలనకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ప్రకటనల్లో నటించరాదని చెప్పింది.

సానియా నటిస్తున్న పాల్ట్రీ యాడ్ ప్రమాణాలకు తగినట్టుగా లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఏఎస్సీఐ ఇటీవలే ఓ ప్రకటనలో తెలిపింది. కోడిమాంసం ఉత్పత్తులలో యాంటీబయోటిక్స్ ఆనవాళ్లు ఉన్నాయంటూ 2014లో సీఎస్ఈ ఇచ్చిన నివేదికను అపహాస్యం చేసేలా అడ్వర్టైజ్ మెంట్ ఉందని సీఎస్ఈ అధికారి తెలిపారు. ఒక రోల్ మోడల్ గా ఇలాంటి ప్రకటనల్లో సానియా నటించడం మంచిది కాదని చెప్పారు. వెంటనే ఈ యాడ్ నుంచి ఆమె తప్పుకోవాలని, లేదా అడ్వర్టైజ్ మెంట్ ను కొత్తగా రూపొందించాలని డిమాండ్ చేశారు. 

Sania Mirza
poultry add
  • Loading...

More Telugu News