Actor Naresh: మా తోటలో ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ లను చూడండి!: నటుడు నరేష్

  • హైదరాబాద్ శివార్లలో నరేష్ కు వ్యవసాయ క్షేత్రం
  • మామిడి తోటను పెంచుతున్న నరేష్
  • చూసేందుకు వచ్చిన సహ నటులు

సినీ తారలెందరికో వ్యవసాయంపై ప్రత్యేక మక్కువ ఉందన్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి ఎంతో మంది ఫామ్ హౌస్ లు నిర్వహిస్తూ ఖాళీ ఉన్న సమయాల్లో వ్యవసాయం చేస్తుంటారు. ఇక సీనియర్ నటుడు నరేష్ కు కూడా హైదరాబాద్ శివార్లలో ఓ ఫామ్ హౌస్ ఉండగా, అక్కడాయన మామిడి తోటను పెంచుతున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు విలక్షణ నటులు ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ లు రాగా, వారితో కలసి దిగిన చిత్రాలను నరేష్, తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తోటి రైతులు ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ లు ఫామ్ హౌస్ కు వచ్చారని చెప్పారు. వారు వ్యవసాయం చేస్తున్న తోటలను చూసేందుకు తనను రావాలని ఆహ్వానించారని తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News