yatra: వైయస్ బయోపిక్ 'యాత్ర'లో షర్మిల పాత్రపై టాలీవుడ్ టాక్!

  • షర్మిల పాత్రను పోషించనున్న భూమిక
  • ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న వార్త
  • సూరీడు పాత్రలో పోసాని

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కు 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వైయస్ పాత్రను ప్రముఖ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నారు. విజయమ్మ పాత్రను 'బాహుబలి-2' ఫేం ఆశ్రిత వేముగంటి పోషించనున్నారు.

ఇక ఈ చిత్రంలో వైయస్ కుమార్తె షర్మిల పాత్రలో భూమిక నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే, జగన్ పాత్రను ఎవరు పోషించబోతున్నారన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. వైయస్ ప్రధాన అనుచరుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటించనున్నట్టు సమాచారం. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.

yatra
movie
tollywood
ys rajasekhara reddy
vijayamma
sharmila
jagan
posani
mammooty
  • Loading...

More Telugu News