budda venkanna: పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బుద్ధా వెంకన్న

  • చంద్రబాబు ఆదేశిస్తే విజయసాయిపై పోటీ చేస్తా
  • జగన్, కన్నా, రఘువీరా వీరంతా ఒకే తానులోని ముక్కలు
  • చంద్రబాబును చూసే 2014లో ఓట్లు వేశారు

దండుపాళ్యం బృందానికి నాయకుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే విశాఖలో విజయసాయిపై పోటీ చేస్తానని... 2.2 లక్షల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిస్తానని సవాల్ విసిరారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైసీపీ అధినేత జగన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వీరంతా ఒకే తానులోని ముక్కలని అన్నారు. తమవల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం చంద్రబాబును చూసే 2014లో టీడీపీకి జనాలు ఓట్లు వేశారని చెప్పారు.

budda venkanna
Pawan Kalyan
Chandrababu
Jagan
raghuveera reddy
kanna lakshminarayana
  • Loading...

More Telugu News