union government: ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే: యనమల
- క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది
- క్రూడ్ ధర తగ్గినప్పుడు ధరలను ఎందుకు తగ్గించలేదు?
- కేంద్ర ప్రభుత్వ విధానాలు సరిగా లేవు
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు ఇక్కడ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం... అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఇక్కడ ధరలను ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పైగా... పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం సరైనది కాదని అన్నారు. ధరలు పెరిగినప్పుడు దాని భారం ప్రజలపై పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.