Ram Gopal Varma: యువతుల అసభ్యకర చిత్రాలకు రాంగోపాల్ వర్మ ఫొటో మార్ఫింగ్.. పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు

  • వర్మ చిత్రాలను మార్ఫింగ్ చేస్తున్న జయకుమార్
  • పంజగుట్ట పోలీసులకు వర్మ ఫిర్యాదు
  • ఆలస్యంగా వెలుగులోకి

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పంజగుట్ట పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. యువతుల అసభ్యకర చిత్రాలకు తన తల ఫొటోను తగిలించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిక్కడపల్లికి చెందిన పి.జయకుమార్ అనే వ్యక్తి తన చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నట్టు వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తనను అప్రతిష్ఠ పాలు చేయాలని ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆర్జీవీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు న్యాయ నిపుణల సలహా తీసుకున్న అనంతరం కేసు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. వర్మ ఈనెల 18నే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Ram Gopal Varma
Hyderabad
Police
Photos
  • Loading...

More Telugu News