Russia: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ
- సోచీలో చర్చలు
- ఇరు దేశాల మధ్య సత్సంబంధాల బలోపేతంపై ముచ్చట
- భారత్, రష్యాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉందన్న మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. భారత్, రష్యాల మధ్య సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సోచీలో భేటీ అయ్యారు. అలాగే, వారి మధ్య ఉగ్రవాదం, సిరియా, ఆఫ్ఘన్లో అశాంతి అంశాలపై కూడా చర్చ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... షాంఘై సహకార సంస్థలో భారత్ శాశ్వత సభ్యత్వం పొందడానికి రష్యా ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. భారత్, రష్యాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉందని పేర్కొన్నారు. సోచీలో చర్చలకు తనను ఆహ్వానించినందుకుగానూ పుతిన్‌కి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.