karnataka: బీజేపీకి కష్టాలు తప్పవా?.. ఆడియో టేపులపై కోర్టుకు వెళతామన్న కాంగ్రెస్

  • బీజేపీని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన అంశం
  • ఆడియో టేపులన్నీ ఒరిజినలే అన్న కాంగ్రెస్ నేత ఉగ్రప్ప
  • ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించాలని డిమాండ్

కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వయత్నం చేసిన బీజేపీకి... చివరకు నిరాశ ఎదురైన సంగతి తెలిసందే. ఇదే సమయంలో మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన ఎమ్మెల్యేలను సమకూర్చుకునే ప్రయత్నంలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప, శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి తదితరులు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో టేపులు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ నేత ఉగ్రప్ప స్పందిస్తూ, ఆ ఆడియో టేపులన్నీ ఒరిజినల్ అని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో వాటిని టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని చెప్పారు.

karnataka
bjp
audio tapes
ugrappa
forensic lab
test
  • Loading...

More Telugu News