mahanati: నాన్న నుంచి విడిపోయాకే సావిత్రమ్మ మద్యానికి బానిసయ్యారు: జెమినీ గణేశన్ కుమార్తె కమల

  • తమిళంలో మా నాన్న కూడా పెద్ద స్టారే
  • ‘మహానటి’లో నా తండ్రి పాత్రను గౌరపప్రదంగా చూపించలేదు
  • ఈ సినిమా తీసే ముందు నాన్న తరపు వారిని సంప్రదిస్తే బాగుండేది

‘మహానటి’లో తన తండ్రి పాత్రను చూపించిన విధానం సరిగా లేదని జెమినీ గణేశన్ కుమార్తె కమల ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి మూలంగా సావిత్రమ్మ మద్యానికి బానిస అయినట్టుగా ‘మహానటి’లో చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో కమల మాట్లాడుతూ, తన తండ్రి నుంచి విడిపోయిన తర్వాతే సావిత్రమ్మ మద్యానికి బానిసయ్యారని, ఆ తర్వాత బయట ప్రపంచంతో ఆమెకు సంబంధాలు తెగిపోయాయని చెప్పారు.

ఈ సినిమా తీసే ముందు కేవలం సావిత్రి తరపు వారిని మాత్రమే సంప్రదించారని, తన తండ్రి తరపు వారితో, సన్నిహితులతో సంప్రదించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ వలే తన తండ్రి కూడా పెద్ద స్టార్ అని అన్నారు. ‘మహానటి’ చిత్రంలో తన తండ్రి పాత్రను గౌరవప్రదంగా చూపించకపోవడంపై కమల అసంతృప్తి వ్యక్తం చేశారు.

mahanati
gemeini ganeshan
daughter kamala
  • Loading...

More Telugu News