chennai: ఒకే వేదికపై జెమినీ గణేశన్ కుమార్తెలు!

  • చెన్నై వేదికగా కలుసుకున్న ఏడుగురు కుమార్తెలు
  • పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్న వైనం
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిని ఫొటో

‘మహానటి’ చిత్రం విడుదల తర్వాత  సావిత్రి-జెమినీగణేశన్ కు సంబంధించిన పలు విషయాలు మరోసారి చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తన తండ్రి పాత్రను వాస్తవాలకు భిన్నంగా చిత్రీకరించారని జెమినీగణేశన్ మొదటి భార్య కుమార్తె కమలాసెల్వరాజ్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జెమినీ గణేశన్ సంతానమంతా ఒక తల్లి బిడ్డలు కాకపోవడంతో వారి మధ్య సయోధ్య ఉండదేమో అనుకుంటారు.

కానీ, ఆ అనుమానాలు నిజం కాదని చెబుతూ జెమినీ గణేశన్ కుమార్తెలు ఒక వేదికగా ఒకటయ్యారు. ప్రతి ఏడాది వీరంతా ఇలా కలుసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా చెన్నైలో గత శుక్రవారం రాత్రి  జెమినీ గణేశన్ కుమార్తెలు ఏడుగురు కలుసుకున్నారు. పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా, జెమినీ గణేశన్ మొదటి భార్య అలిమేలు, రెండో భార్య సావిత్రి, మూడో జీవిత భాగస్వామి పుష్పవల్లి, నాల్గో భార్య జూలియా. జెమినీ గణేశన్ కు మొత్తం ఏడుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

కాగా, జెమినీ గణేశన్ -అలిమేలు సంతానం.. డాక్టర్ జయ శ్రీధర్, డాక్టర్ రేవతి స్వామినాథన్, డాక్టర్ కమలా సెల్వరాజ్, నారాయణి గణేశన్

జెమినీ గణేశన్ - సావిత్రి సంతానం.. విజయచాముండేశ్వరి, సతీష్

జెమినీ గణేశన్ - పుష్పవల్లి సంతానం.. రేఖ (బాలీవుడ్ నటి), రాధా సయ్యద్
  

  • Error fetching data: Network response was not ok

More Telugu News