paritala sunitha: జగన్ మాటలు నమ్మి ఓట్లు వేయకండి.. అడ్డంగా దోచేస్తారు: పరిటాల సునీత

  • అధికారం కోసం నోటికొచ్చిన హామీలన్నీ ఇస్తున్నారు
  • చంద్రబాబు సుభిక్ష పాలనను భగ్నం చేసేందుకు కుట్ర జరుగుతోంది
  • కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక గుణపాఠం

అధికారంలోకి రావాలన్న తపనతో నోటికొచ్చిన హామీలన్నింటినీ వైసీపీ అధినేత జగన్ ఇస్తున్నారని, ఆయన మాటలు నమ్మి ఓట్లు వేస్తే, రాష్ట్రాన్ని పూర్తిగా దోచేస్తారని మంత్రి పరిటాల సునీత అన్నారు. పేదప్రజలకు అండగా ఉన్న ఎందరో గొప్ప వ్యక్తులను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలాంటి బాధలను అనుభవించామని, మరోసారి అలాంటి అనుభవాలను భరించలేమని చెప్పారు.

ఏపీ అభివృద్ధికి బీజేపీ సహకరించకపోయినా, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని అన్నారు. బీజేపీ, వైసీపీలు కుమ్మక్కై చంద్రబాబు సుభిక్ష పాలనను భగ్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక గుణపాఠం వంటివని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

paritala sunitha
jagan
Chandrababu
  • Loading...

More Telugu News