nagachaitanya: కూల్ విలన్ గా మాధవన్ .. 'సవ్యసాచి'ని పరుగులు పెట్టించే పాత్ర!

- చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
- హీరోను టెన్షన్ పెట్టే పాత్రలో మాధవన్
- కీలకమైన పాత్రలో భూమిక
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయకుడిగా మాధవన్ కు మంచి క్రేజ్ వుంది. కెరియర్ ఆరంభం నుంచి వైవిధ్యభరితమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆయన, పాత్రల ఎంపిక విషయంలో ఇప్పుడు మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. తాజాగా ఆయన తెలుగులో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న 'సవ్యసాచి'లో ఆయన విలన్ గా కనిపించనున్నాడు.
