Osmania University: నచ్చావంటూ... రీసెర్చ్ స్కాలర్ వెంటపడి మోసం చేసిన ఉస్మానియా ప్రొఫెసర్!
- పెళ్లి పేరిట మూడేళ్లు తిప్పుకున్న కిరణ్ కుమార్
- బాధితురాలి నుంచి రూ. 25 లక్షలు తీసుకున్న వైనం
- రహస్యంగా మరో వివాహం చేసుకున్న కిరణ్
రీసెర్చ్ స్కాలర్ గా ఉస్మానియాలో విద్యాభ్యాసం చేస్తున్న ఓ యువతిని, నచ్చావంటూ వెంటపడి, పెళ్లి పేరిట మూడు సంవత్సరాల పాటు వెంట తిప్పుకుని, డబ్బు గుంజుకుని మోసం చేసిన కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ పై కేసు నమోదైంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం, కిరణ్ కుమార్, గడచిన మూడేళ్లుగా రీసెర్చ్ స్కాలర్ వెంట తిరుగుతున్నాడు. వీరిద్దరూ శారీరకంగానూ కలిశారు.
అయితే తనకు చెల్లెళ్లు ఉన్నారని, వారి పెళ్లి అయితేనే తాను వివాహం చేసుకోగలనని నమ్మబలుకుతూ కాలం గడిపాడు. ఈ క్రమంలో ఆమె దగ్గర నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నాడు. ఆపై రహస్యంగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన వద్ద నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయగా, చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఐపీసీలోని 420, 323, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.