Yaddanapudi Sulochanarani: నిద్రలోనే కన్నమూసిన యద్దనపూడి... అంత్యక్రియలు అమెరికాలోనే!

  • గుండెపోటు కారణంగా మృతి
  • కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేదన్న శైలజ
  • ఇండియాకు తీసుకొచ్చే వీలు లేదని వ్యాఖ్య

వృద్ధాప్యం మీద పడటంతో తన కుమార్తె శైలజ వద్ద కాలం గడుపుతున్న యద్దనపూడి సులోచనారాణి 79 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. గత రాత్రి నిద్రలోనే ఆమె కన్నుమూశారని శైలజ తెలిపారు. గుండెపోటు వచ్చిందన్న విషయం ఎవరికీ తెలియదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేకపోయిందని ఆమె తెలిపారు.

తన తల్లి అంత్యక్రియలు స్వదేశంలో చేయాలని ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించని కారణంగా కుపర్డినోలోనే ముగించనున్నట్టు స్పష్టం చేశారు. తమకు ఎంతో మంది ఫోన్ కాల్స్ చేసి సంతాపం చెబుతున్నారని, వారందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలని అన్నారు. తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన యద్దనపూడి సులోచనారాణి మృతి నవలా లోకానికి తీరని లోటని పలువురు రచయితలు వ్యాఖ్యానించారు. 

Yaddanapudi Sulochanarani
Novelist
USA
California
  • Loading...

More Telugu News