yaddanapudi Sulochanarani: ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత
- కాలిఫోర్నియా పరిధిలోని కుపర్టినోలో మృతి
- గుండెపోటుతో మృతి చెందినట్టు వెల్లడించిన కుమార్తె శైలజ
- సంతాపం తెలిపిన ఎమెస్కో విజయకుమార్
ప్రముఖ నవలా రచయిత్రి, తన రచనలతో కోట్లాది తెలుగు పాఠకులకు సుపరిచితురాలైన యద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలో ఉన్న కుపర్టినోలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 79 సంవత్సరాలు. యద్దనపూడి మృతిని ఆమె కుమార్తె శైలజ ధ్రువీకరించారు. ప్రస్తుతం తన కుమార్తె వద్ద కాలం గడుపుతున్న ఆమె మరణం నవలాలోకానికి తీరని లోటు. ఆమె మృతి పట్ల ఎమెస్కో విజయకుమార్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించిన ఆమె, మధ్యతరగతి మహిళల ఊహలను, వాస్తవాలను తన నవలల్లో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 1970వ దశకంలో ప్రతి చదువుకునే స్త్రీ ఇంటా యద్దనపూడి నవల కనీసం ఒకటన్నా నిత్యమూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. యద్దనపూడి సులోచనారాణి మృతికి సంబంధించి మరాన్ని వివరాలు తెలియాల్సి ఉంది.