Mahatma Gandhi: ఆరోజు రైళ్లలో శాకాహారం మాత్రమే... రైల్వే శాఖ కీలక నిర్ణయం

  • అక్టోబర్ 2న శాకాహార దినంగా జరుపుకోవాలని రైల్వే శాఖ నిర్ణయం
  • మూడేళ్లపాటు అక్టోబర్ 2న కేవలం శాకాహారమే
  • సర్క్యులర్ జారీ చేసిన రైల్వే

మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న భారతీయ రైల్వేలు 'వెజిటేరియన్ డే'ను నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వరుసగా మూడు సంవత్సరాల పాటు అక్టోబర్ 2న రైళ్లు, రైల్వే స్టేషన్లలో శాకాహారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్ లకూ సర్క్యులర్ లను రైల్వే బోర్టు పంపింది.

 2018, 2019, 2020 సంవత్సరాల్లో అక్టోబర్ 2న ఎటువంటి మాంసాహారాన్నీ రైల్వేల పరిధిలో అందుబాటులో ఉంచరాదని, ఆ రోజు అందరు ఉద్యోగులు కూడా శాకాహారులుగా మారిపోవాలని సూచించింది. అక్టోబర్ 2న దండీ మార్చ్ ని గుర్తు చేస్తూ, సబర్మతీ నుంచి స్వచ్ఛతా ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ఇక గాంధీ చిత్రాలతో కూడిన డిజిటల్ మ్యూజియం రైలును దేశవ్యాప్తంగా నడిపిస్తామని పేర్కొంది. రైలు బోగీలను గాంధీ చిత్రాలతో అలంకరిస్తామని వెల్లడించింది.

Mahatma Gandhi
October 2
Gandhi Jayanti
Indian Railways
Vegetarian Day
  • Loading...

More Telugu News