Karnataka: యడ్యూరప్ప కుమారుడు ఫోన్ లో రూ. 15 కోట్లు ఆఫర్ చేసింది నా భార్యకు కాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • రూ. 15 కోట్ల డబ్బు, మంత్రి పదవి
  • శివరామ హెబ్బార భార్య వనజాక్షికి ఫోన్
  • మాట్లాడిన యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర
  • ఆడియో టేపులు నకిలీవన్న శివరామ

యడ్యూరప్ప కుమారుడు, బీజేపీ నేత విజయేంద్ర, తన భార్య వనజాక్షితో మాట్లాడినట్టు, తాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయిస్తే రూ. 15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమవుతున్న ఆడియో క్లిప్ పై యల్లాపుర కాంగ్రెస్ శాసనసభ్యుడు శివరామ హెబ్బార స్పందించారు. యడ్డీ బలపరీక్షలో బీజేపీకి మద్దతివ్వాలని తననుగానీ, తన భార్యను గానీ ఎవరూ సంప్రదించలేదని, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోలో మాట్లాడింది తన భార్య కాదని ఆయన స్పష్టం చేశారు.

రూ. 15 కోట్లతో పాటు ఓ మంత్రి పదవిని ఇస్తామంటూ శ్రీరాములు చెబుతున్నట్టు ఉన్న ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చిందన్న విషయం తాను అసెంబ్లీలో ఉన్న సమయంలో తెలిసిందని చెప్పారు. ఈ తరహాలో అబద్ధపు టేపులను విడుదల చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, విజయేంద్ర స్వయంగా శివరామ హెబ్బార భార్య వనజాక్షిని ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత వీఎస్ ఉగ్రప్ప ఆరోపించిన సంగతి తెలిసిందే.

Karnataka
Sivarama Hebbara
Vanajakshi
Audio Tapes
Social Media
  • Loading...

More Telugu News