TTD: రమణదీక్షితుల ఆరోపణలను ఖండిస్తూ ఆధారాలు బయటపెట్టిన టీటీడీ!

  • వెయ్యికాళ్ల మండపం కూల్చివేత సంబంధించిన పత్రాలపై రమణదీక్షితుల సంతకాలు  
  • ఆ పత్రాలను బయటపెట్టిన టీటీడీ
  • వకుళామాత పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదన్న వైనం

తిరుమల శ్రీవారి ఆలయం రాజకీయనాయకుల చేతిలోకి వెళ్లిపోయిందని, స్వామి వారి పూజా కైంకర్యాల వ్యవహారంలో అధికారులు తలదూరుస్తున్నారని, వకుళామాత పోటులో బండలు మార్చే నిమిత్తం చాలా రోజులుగా దానిని మూసివేశారని పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలను టీటీడీ ఖండించింది. నాడు వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు అంగీకరిస్తూ రమణదీక్షితులు సంతకాలు చేసిన పత్రాలను టీటీడీ బయటపెట్టింది. వకుళామాత పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదని, కేవలం మరమ్మతుల నిమిత్తం పనులు చేశామని చెప్పింది. ఈ సంద్భంగా పోటును చూసేందుకు మీడియాను ఆహ్వానించి దాని లోపలికి పంపింది.

  • Loading...

More Telugu News