rajanikanth: కర్ణాటక సంఘటనను పాలకులందరూ గమనించాలి: ప్రముఖ నటుడు రజనీకాంత్

  • మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో రజనీకాంత్  భేటీ
  • సుప్రీంకోర్టు జోక్యంతో ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది
  • ఎన్నికల ప్రకటన తర్వాత నేను పోటీ చేసే విషయం చెబుతా
  • ఇతర పార్టీలతో పొత్తు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ విఫలమవడంపై ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ స్పందించారు. చెన్నైలో మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో రజనీకాంత్ ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం, రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయాలని బీజేపీ చూసిందని, సుప్రీంకోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని సంతోషం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో జరిగిన ఈ సంఘటనను పాలకులందరూ గమనించాలని కోరారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయమై రజనీకాంత్ స్పష్టంగా చెప్పలేదు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పుడు ఈ విషయం స్పష్టం చేస్తానని, ఇతర పార్టీలతో పొత్తు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని స్పష్టం చేశారు.

కాగా, కావేరీ జలాల బోర్డు గురించీ ఆయన ప్రస్తావించారు. ఈ బోర్డు కర్ణాటక ఆధీనంలో కాకుండా, ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

rajanikanth
chennai
  • Loading...

More Telugu News