Andhra Pradesh: కర్ణాటకలో యడ్యూరప్పను బలిపశువుని చేశారు!: రఘువీరారెడ్డి

  • దీని కంతటికి కారణం ప్రధాని మోదీ
  • బీజేపీ పతనం ఏపీలో మొదలైంది
  • రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ పతనం  చూడబోతున్నాం

కర్ణాటకలో యడ్యూరప్పను బలిపశువుని చేశారని, దీని కంతటికీ కారణం ప్రధాని మోదీ అని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం నుంచి స్థానిక లెనిన్ సెంటర్ వరకు ప్రజాస్వామ్య విజయోత్సవ ర్యాలీ ఈరోజు నిర్వహించారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న రఘువీరారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ పతనం ఏపీలో మొదలైందని, ఈరోజున మన రాష్ట్రంలోని బీజేపీ నేతలు సంఘబహిష్కృతులని విమర్శించారు. ఇక బీజేపీ పతనాన్ని రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్ గఢ్ లో చూడబోతున్నామని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ పతనం ఖాయమని జోస్యం చెప్పారు.

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయమై ఎప్పుడైతే బీజేపీ యూటర్న్ తీసుకుందో అప్పుడే బీజేపీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. చట్టసభల్లో నీతులు చెప్పే బీజేపీ వాళ్లు, బయట కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుండటం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. 

Andhra Pradesh
raghuveera reddy
  • Loading...

More Telugu News