Karnataka: రామ్ నగర్ స్థానానికి కుమారస్వామి రాజీనామా... భార్యను రాజకీయాల్లోకి తెచ్చే ఆలోచన!

  • రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన కుమారస్వామి
  • చెన్నపట్టణ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయం
  • రామ్ నగర్ ను వదిలేస్తూ రాజీనామా

ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ గెలిచిన జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి, చెన్నపట్టణ నియోజకవర్గాన్ని ఉంచుకుని, రామ్ నగర్‌ నియోజకవర్గాన్ని వదిలేశారు. ఈ మేరకు రాజీనామాను సమర్పించారు. తొలుత ఆయన చెన్నపట్టణ అసెంబ్లీని వదులుకుంటారని భావించినప్పటికీ, అక్కడ పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి సీపీ యోగీశ్వర్ బలమైన నేత కావడంతో, అతనికి మరో అవకాశం ఇచ్చే ఉద్దేశంలో కుమారస్వామి లేరని తెలుస్తోంది. ఇక మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నిక జరిగే రామ్ నగర్ నుంచి తన భార్యను బరిలోకి దింపాలని, ఇక్కడ కాంగ్రెస్ బలం కూడా తోడు అవడంతో ఆమె గెలుపు సునాయాసమేనని కుమారస్వామి భావిస్తున్నట్టు సమాచారం.

Karnataka
Kumaraswamy
Ramnagara
Chennapattana
  • Loading...

More Telugu News