Neha Dhupiya: తనకన్నా రెండేళ్ల చిన్నవాడిని రహస్యంగా పెళ్లి చేసుకున్న నటి నేహా ధూపియా!

  • సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పెట్టిన నేహా
  • అంగద్ ను తమ్ముడిగా చూసి రాఖీ కట్టాలని వెకిలి పోస్టు
  • ఘాటుగా స్పందించిన నేహా ధూపియా

ఇటీవల తనకన్నా రెండేళ్లు చిన్నవాడైన నటుడు అంగద్ బేడీని గోప్యంగా వివాహం చేసుకున్న నటి నేహా ధూపియా, తమ పెళ్లి విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆమె వివాహం గురించి తెలుసుకున్న పలువురు అభినందించగా, ఓ యువకుడు పెట్టిన వెకిలి కామెంట్ పై నేహ ఘాటుగా స్పందించింది.

అంగద్ బేడీ తాజా సినిమా 'సూర్మా'లోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ నేహా ధూపియా ఓ పోస్టు పెట్టగా, దానిపై స్పందించిన ఓ నెటిజన్, అతను నేహా కన్నా రెండేళ్లు చిన్నవాడని గుర్తు చేస్తూ, అతను భర్త కాదని, తమ్ముడి వంటి వాడని, రాఖీ కట్టాలని సలహా ఇచ్చాడు. దీనిపై స్పందించిన నేహ "నీ సలహా నచ్చిందబ్బాయ్" అంటూనే పంచ్ వేసింది. తనకో ఫేవర్ చేయాలని చెబుతూ, 'నీ జీవితం ఏంటో నువ్వు చూసుకో' అంటూ ఓ పంచ్ విసిరింది.

Neha Dhupiya
Angad Bedi
Social Media
  • Loading...

More Telugu News