India: ఫ్లాష్ బ్యాక్: మెజారిటీని కూడగట్టలేక రాజీనామాలు చేసిన ప్రధానమంత్రులు!

  • జనతాపార్టీ విడిపోవడంతో మెజారిటీని కోల్పోయిన మొరార్జి దేశాయ్
  • అవిశ్వాసంపై చర్చ పూర్తి కాకుండానే రాజీనామా
  • 1996లో వాజ్ పేయిదీ అదే తీరు
  • 272 మంది మద్దతు కూడగట్టుకోలేక పోయి రాజీనామా

కన్నడనాట బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప సీఎం పదవి మూనాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప మాదిరిగానే, మెజారిటీని కూడగట్టడంలో విఫలమైన ప్రధానమంత్రులు కూడా ఇండియాలో ఉన్నారు. 1977 మార్చి 24న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా జనతాపార్టీ తరఫున మొరార్జి దేశాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండేళ్ల తరువాత పార్టీలో చీలిక ఏర్పడింది. కొంతమంది జనతాపార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి, చరణ్ సింగ్ ఏర్పాటు చేసిన జనతాపార్టీ (ఎస్)లో చేరిపోయారు. అప్పట్లో అవిశ్వాస తీర్మానం పెడితే, మెజారిటీ సభ్యులను కూడగట్టలేనని భావించిన మొరార్జి దేశాయ్, అవిశ్వాసంపై చర్చ పూర్తి కాకుండానే రాజీనామా చేశారు.

ఆ తరువాత 1996 మేలో జరిగిన ఎన్నికల తరువాత లోక్ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తరఫున అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి రాష్ట్రపతి రెండు వారాల సమయం ఇచ్చినా, లోక్ సభలో 272 మంది మద్దతును కూడగట్టడంలో విఫలమై, బల నిరూపణకు ముందే రిజైన్ చేశారు. ఆ సమయంలో వాజ్ పేయి లోక్ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగం చివరిలో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News