Karnataka: గద్దెనెక్కకుండానే విభేదాలు... కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పదవుల తగాదా!

  • రెండున్నరేళ్లు సీఎం పదవి కావాలని కాంగ్రెస్ మెలిక
  • హోమ్, రెవెన్యూ శాఖలు కోరిన కాంగ్రెస్
  • ససేమిరా అంటున్న కుమారస్వామి!

కన్నడనాట ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండానే కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పదవుల పంపకంలో తగాదాలు వచ్చాయి. ఈ ఉదయం ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న విషయమై ఇరు పార్టీ నేతల మధ్యా చర్చలు ప్రారంభం కాగా, రెండున్నరేళ్ల పాటు తమకు సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ మెలిక పెట్టింది. దాంతోపాటు కీలకమైన హోమ్, రెవెన్యూ తదితర శాఖలను కాంగ్రెస్ డిమాండ్ చేయగా, దానికి కుమారస్వామి ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన శివకుమార్ తో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ డిప్యూటీ సీఎం పదవి కోసం పోటీపడుతుండగా, శివకుమార్ కు ఆ పదవి ఇవ్వబోనని కుమారస్వామి పేర్కొన్నట్టు సమాచారం. ఈ పదవుల కేటాయింపు ఇరు పార్టీలకూ తలనొప్పిగా మారగా, ఢిల్లీ వెళ్లి, రాహుల్, సోనియా సమక్షంలోనే తేల్చుకోవాలని కుమారస్వామి నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారని జేడీఎస్ పేర్కొంది.

  • Loading...

More Telugu News