Vijayanagaram District: ప్రియుడి కోసం భర్తను చంపించిన సరస్వతి కేసులో మరో మలుపు!

  • విజయనగరం జిల్లాలో కలకలం రేపిన కేసు
  • పెళ్లికి ముందే భర్తను చంపించాలని పన్నాగం
  • బెంగళూరులోని తన స్నేహితురాలి సహకారం కోరిన సరస్వతి

విజయనగరం జిల్లాలో ఈ నెల ఆరంభంలో కలకలం రేపిన నవ వరుడి హత్య కేసు మరో మలుపు తిరిగింది. తన ప్రియుడు శివకుమార్ తో కలసి ప్లాన్ చేసిన సరస్వతి, విశాఖపట్నానికి చెందిన గూండాలతో తన భర్త గౌరీ శంకర్ ను హత్య చేయించగా, ఇప్పటికే నిందితులు అందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణలో మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు.

బెంగళూరులో గౌరీ శంకర్ ఉద్యోగం చేస్తుండగా, ఆయన్ను అక్కడే హత్య చేయించేందుకు తన స్నేహితురాలితో కలసి వివాహానికి ముందే సరస్వతి ప్లాన్ చేసిందని, అయితే, బెంగళూరులో ఆమె పన్నాగం ఫలించలేదని పోలీసులు తేల్చారు. ఈ కేసును విచారిస్తుంటే, బెంగళూరుకు చెందిన సరస్వతి స్నేహితురాలి ప్రమేయం గురించి తెలిసిందని, ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Vijayanagaram District
Murder
Saraswati
Bengalore
  • Loading...

More Telugu News