Congress: రేపు కాదు... 23కు మారిన కుమారస్వామి ప్రమాణస్వీకారం...!

  • 21న రాజీవ్ వర్థంతి
  • సోమవారం ప్రమాణ స్వీకారం వద్దని చెప్పిన కాంగ్రెస్
  • 23కు వాయిదా పడ్డ వేడుక

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కుమారస్వామి బుధవారం 23వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీఎస్ వెల్లడించింది. వాస్తవానికి ఆయన సోమవారం 21వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ప్రకటించినప్పటికీ, 21న రాజీవ్ గాంధీ వర్థంతి ఉండటంతో ప్రమాణ స్వీకార తేదీని మార్చాలని కాంగ్రెస్ పార్టీ చేసిన వినతిని కుమారస్వామి మన్నించారు. ఇక అత్యంత అట్టహాసంగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం జరుగనుండగా, ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ నేతలు హాజరవుతారని తెలుస్తోంది.

Congress
Kumaraswamy
Karnataka
CM
Oath
Rajiv Gandhi
  • Loading...

More Telugu News