assembly: అసెంబ్లీలో జాతీయ గీతం వస్తోంటే బీజేపీ నేతలు వెళ్లిపోయారు.. వాళ్లు దేనినీ పట్టించుకోరు!: రాహుల్‌ గాంధీ విమర్శ

  • శాసనసభ ముగియగానే ఈ దృశ్యం కనపడింది
  • దేశంలోని అన్ని వ్యవస్థలను అవమానిస్తున్నారు
  • మేము జనంతో కలిసి గట్టిగా పోరాడుతున్నాం

'మీరు గమనించారా? కర్ణాటకలో ఈరోజు శాసనసభ ముగియగానే జాతీయ గీతం వస్తోంది.. అదే సమయంలో ఏమీ పట్టించుకోకుండా బీజేపీ నేతలు, ప్రొటెం స్పీకర్‌ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అధికారంలో ఉంటే వారు దేన్నీ పట్టించుకోరని దీని ద్వారా తెలుస్తోంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌.. దేశంలోని అన్ని వ్యవస్థలను అవమానిస్తున్నాయి' అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యమంటే అసలే గిట్టని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా తాము జనంతో కలిసి గట్టిగా పోరాడుతున్నామని అన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచిందని, బీజేపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఐక్యంగా నిలబడ్డారని అన్నారు. నిత్యం అవినీతిని అంతమొందించడంపై మాట్లాడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో అవినీతిని ప్రోత్సహించారని, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ భ్రష్టుపట్టించిందని అన్నారు.

  • Loading...

More Telugu News