Andhra Pradesh: కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా బీజేపీకి తగినశాస్త్రి జరిగింది: సీపీఐ నారాయణ

  • ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే బీజేపీ ఖూనీ చేసింది
  • బీజేపీ వాళ్ల దగ్గర డబ్బులున్నాయి 
  • పాపం, ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి టైమే లేదు
  • విధిలేని పరిస్థితుల్లో సీఎం యడ్యూరప్ప రాజీనామా చేశారు

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో విఫలమైన బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా బీజేపీకి తగిన శాస్తి జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తుంటే అటు ప్రజలు, రాజకీయపార్టీలు, ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థ .. చివరకు న్యాయవ్యవస్థ కూడా ఈ అన్యాయాన్ని భరించలేక తెగించి ఈ తీర్పును చెప్పిందన్నారు.

పదిహేను రోజులకు బదులుగా ఇరవై నాలుగు గంటల్లోనే బీజేపీ తమ బలం నిరూపించుకోవాలని కోర్టు ఆదేశించి మంచి పనిచేసిందని అన్నారు. ‘బీజేపీ వాళ్ల దగ్గర డబ్బులున్నాయి కానీ, పాపం, ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి టైమే లేదు! విధిలేని పరిస్థితుల్లో సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు’ అని అన్నారు.

Andhra Pradesh
CPI Narayana
  • Loading...

More Telugu News