Chandrababu: ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారంతా సంతోషంగానే ఉంటారు!: చంద్రబాబు స్పందన

  • యడ్యూరప్ప రాజీనామా వార్త ఇప్పుడే తెలిసింది
  • ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారంతా సంతోషంగా ఉంటారు
  • ఏఎన్ఐతో తో ముఖ్యమంత్రి చంద్రబాబు

కర్ణాటకను ఐదేళ్ల పాటు పాలిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప... చివరకు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమై... సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విధానసౌధ నుంచి నేరుగా రాజ్ భవన్ కు బయల్దేరారు. దీంతో, కర్ణాటకానికి ముగింపు పలికినట్టైంది. గవర్నర్ సూచనల మేరకు ఈ రాత్రి, లేదా రేపు ఉదయం కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. "కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసినట్టు ఇప్పుడే వార్త వచ్చింది. అంతా సంతోషంగా ఉన్నారా? ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారంతా సంతోషంగానే ఉంటారు" అని అన్నారు. ఈ మేరకు ఆయన వార్తా సంస్థ ఏఎన్ఐతో స్పందించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News