siddaramaiah: మోదీపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డ సిద్ధరామయ్య

  • అవినీతి గురించి అలుపెరగకుండా ప్రసంగిస్తారు
  • ఎమ్మెల్యేను కొనకుండా మోదీ అడ్డుకోగలరా?
  • స్థిరమైన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించగలరా?

ప్రధాని మోదీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. అవినీతి గురించి అలుపెరుగకుండా ప్రసంగించడంలో మోదీ సిద్ధహస్తుడని చెప్పారు. కానీ ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నది ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా యడ్యూరప్పను, బీజేపీ నేతలను నిలువరించగలిగే నైతిక విలువలు మోదీకి ఉన్నాయా? అని ప్రశ్నించారు.

కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక సుస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తారా? అని అన్నారు. ఈ మేరకు సిద్ధూ ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సాక్షాత్తు యడ్యూరప్ప దగ్గర నుంచి ఇతర బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆడియో టేపులు బయటకొచ్చిన సంగతి తెలిసిందే. 

siddaramaiah
Narendra Modi
tweet
yeddyurappa
  • Loading...

More Telugu News