Karnataka: సభలో కనిపించని ‘గాలి’ సోదరుడు సోమశేఖరరెడ్డి!

  • ప్రమాణ స్వీకార సమయంలో ఆయన పేరు పిలిచిన ప్రొటెం స్పీకర్
  • సభలో ఆయన కనిపించకపోవడంపై  సర్వత్రా చర్చలు 
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి వున్నట్టు అనుమానం 

కర్ణాటక అసెంబ్లీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి హాజరుకాలేదు. కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించే సమయంలో సోమశేఖరరెడ్డి పేరును ప్రొటెం స్పీకర్ పిలవగా .. సభలో ఆయన కనిపించకపోవడం గమనార్హం. కాగా, సోమశేఖరరెడ్డి సభలో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ పాటిల్ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. నేటి అసెంబ్లీ సమావేశానికి వారు హాజరుకాలేదు. అదే సమయంలో, సోమశేఖరరెడ్డి కూడా అసెంబ్లీకి రాలేదు. కనిపించకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరూ బీజేపీకి మద్దతిస్తున్నారనే అనుమానాలు తలెత్తాయి. ఆ ఎమ్మెల్యేలతో కలిసి సోమశేఖరరెడ్డి ఉండి ఉంటారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

కాగా, కనిపించకుండాపోయిన తమ పార్టీ ఎమ్మెల్యేల గురించి కాంగ్రెస్ మాత్రం సమర్థించుకుంటోంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం తమకు అందుబాటులో లేరని, అందుబాటులోకి వస్తే మాత్రం తమకే వారి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Karnataka
bjp
gali
  • Loading...

More Telugu News