cricketer bravo: క్రికెటర్ బ్రావో మనసులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె!

  • 2006లో మొదటిసారి సబ్బు ప్రకటనలో చూసిన బ్రావో
  • అప్పటి నుంచి ఆమెకు మనసులో చోటు
  • ఒకసారి కలుసుకుని, ముచ్చటించాలని కోరిక
  • హర్బజన్ సింగ్ తో తన మనసులో మాటను చెప్పిన బ్రావో

వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో బాలీవుడ్ నటీమణి దీపికా పదుకొనె తన మనసుపై ఎంతో ప్రభావం చూపించినట్టు మనసులో మాట బయటపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా ఐపీఎల్ సీజన్ లో బిజీగా ఉన్న బ్రావో తన జట్టు సహచరుడు హర్బజన్ సింగ్ తో దీపికా పదుకొనె అంటే తనకు ఎంత అభిమానమో తెలియజేశాడు. అభిమాన నటి అంటే బ్రావోకు 34 ఏళ్ల దీపికా పదుకొనే మాత్రమే గుర్తుకు వస్తుందట.

2006లో చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మొదటి సారి భారత పర్యటనకు వచ్చినప్పుడు హోటల్ గదిలో టీవీలో వచ్చిన ఓ సబ్బు ప్రకటనలో దీపికను చూశాడు బ్రావో. అప్పటి నుంచి ఆమె తన మనసులోనే నిలిచిపోయినట్టు తెలిపాడు. తన అభిమాన నటిని ఓ సారి కలుసుకుని, ఆమెతో ముచ్చటించాలన్నది తన చిరకాల కోరికగా పేర్కొన్నాడు. అయితే, వెస్ట్ ఇండీస్ లో దీపికా పదుకొనే మాదిరి వ్యక్తిని గుర్తించలేదా? అని హర్బజన్ సరదాగా ప్రశ్నించగా... అందుకు బ్రావో ఇచ్చిన సమాధానం ‘నీవు మరో దిపికను గుర్తించలేవు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకే ఒక్క దీపిక’ అని.

cricketer bravo
depika padukune
  • Loading...

More Telugu News