Tamilnadu: నమిత తన పెళ్లికి ముందు నటించిన చిత్రం విడుదలకు రెడీ!

  • నమిత పెళ్లికి ముందు నటించిన చిత్రం ‘పొట్టు’ 
  • ఈ నెల 25న విడుదల కానుంది
  • ఓ కొత్త చిత్రంలో నటించేందుకు అంగీకరించిన నమిత!

దక్షిణాది ముద్దుగుమ్మ నమిత తన బాయ్ ఫ్రెండ్ వీరేన్ చౌదరిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహానంతరం నమిత కొత్త చిత్రంలో నటించలేదు. అయితే, తన పెళ్లికి ముందు నటించిన ‘పొట్టు’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. కాగా, నమిత తన వివాహానంతరం ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.

ప్రముఖ దర్శక నిర్మాత టి.రాజేందర్ నిర్మించనున్న ఓ చిత్రంలో నమిత నటించనున్నట్టు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నమిత ప్రధానపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. 

  • Loading...

More Telugu News