karnataka: అజ్ఞాతం వీడని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బలపడుతున్న అనుమానాలు!

  • కర్ణాటక అసెంబ్లీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలు
  • హాజరు కాని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • కాంగ్రెస్ నేతల్లో బలపడుతున్న అనుమానాలు

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ప్రమాణస్వీకారాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరగనుంది. మరోవైపు ఊహించినట్టుగానే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ ను ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు.

ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆనంద్ సింగ్ అసెంబ్లీకి వస్తారని, బలపరీక్షలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పారు. అయినప్పటికీ ఇంతవరకు ఆయన అసెంబ్లీకి రాకపోవడంతో, కాంగ్రెస్ నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. ఆనంద్ సింగ్ బీజేపీకి మద్దతిస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి.

karnataka
assembly
anand singh
congress
  • Loading...

More Telugu News