Kajal Agarwal: పాత్ర నచ్చితే వారితో నటించేందుకు కూడా సిద్ధమే: కాజల్ అగర్వాల్

  • కాలానికి తగ్గట్టు మారితేనే ఇక్కడ ఉండగలం
  • యువ హీరోలతో నటించడానికి నేను సిద్ధం
  • శర్వానంద్ సరసన ఒక సినిమాలో నటిస్తున్నా

సినీ పరిశ్రమలోకి వచ్చి 15 ఏళ్లు అవుతున్నా కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే, ప్రస్తుతం ఆమెకు అవకాశాలు కొంచెం తగ్గాయనే చెప్పాలి. 'ప్యారీస్ ప్యారీస్' అనే ఒక తమిళ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ నేపథ్యంలో యువ హీరోలతో సైతం జతకట్టేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కథ, పాత్ర నచ్చితే యువ హీరోలతో నటించేందుకు తాను సిద్ధమని చెప్పింది. కాలానికి తగ్గట్టుగా మారితేనే, ఇక్కడ నిలబడగలమని తెలిపింది.
 
15 ఏళ్లుగా నటిస్తున్నప్పటికీ, ఇప్పటికీ తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని... అదృష్టం ఉంటేనే ఇదంతా జరుగుతుందని కాజల్ చెప్పింది. తాను అందంగా ఉంటానని అందరూ అంటుంటారని, అందాన్ని కాపాడుకోవడానికి తాను నిరంతరం శ్రమిస్తూనే ఉంటాననే తెలిపింది. పాత్రకు న్యాయం చేసేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని చెప్పింది. తెలుగులో శర్వానంద్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నానని తెలిపింది. 

Kajal Agarwal
tollywood
kollywood
  • Loading...

More Telugu News