sai dharam tej: హీరో సాయిధరమ్ తేజ్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు

  • నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లో పలు చేట్ల డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు
  • 22 కార్లు, 29 బైకులు సీజ్
  • సాయిధరమ్ కు నిర్వహించిన టెస్టులో '0' పాయింట్లు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పోలీసులు పలు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మందు బాబులు అడ్డంగా బుక్కయ్యారు. మొత్తమ్మీద 22 కార్లు, 29 బైకులు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. ఫుల్ గా మద్యం తాగిన ఓ మహిళ తన కారును ఇవ్వాలంటూ ప్రాధేయపడినా పోలీసులు కరుణించలేదు. ఆమె కారును సీజ్ చేసి, డ్రంకెన్ డ్రైవ్ కేసు పెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో హీరో సాయిధరమ్ తేజ్ వెళ్తుండగా, ఆయనను పోలీసులు ఆపారు. అందరి మాదిరిగానే ఆయనకు కూడా బ్రీత్ అనలైజర్ టెస్టును నిర్వహించారు. అయితే టెస్టులో '0' పాయింట్లు వచ్చాయి. దాంతో ఆయనను పోలీసులు పంపించేశారు.

sai dharam tej
tollywood
Drunk Driving
drunk and drive
breath analyser test
  • Loading...

More Telugu News