kumaraswamy: సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెంచిన కుమారస్వామి

  • ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న జేడీఎస్, కుమారస్వామి
  • జేడీఎస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన కుమారస్వామి
  • ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేస్తామంటూ భరోసా

ఈ సాయంత్రం కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు. దీంతో, మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బలపరీక్షలో బీజేపీ గెలుపొందుతుందా? లేక ఓడి పోతుందా? అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. ఈ తరుణంలో, తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా జేడీఎస్ ఎమ్మల్యేలపై ఆ పార్టీ నేత కుమారస్వామి నిఘాను మరింత పెంచారు. అంతేకాకుండా, తమ ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరిపారు. బలపరీక్షలో యడ్యూరప్ప ఓడిపోతారని, ఆ తర్వాత మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని భరోసా ఇచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News