Karnataka: మీడియాకు ఫోన్ చేసి.. పార్టీ మారడం లేదని చెప్పిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయబోను  
  • బీజేపీ నేతలెవరూ నన్ను సంప్రదించలేదు 
  • కాంగ్రెస్ లోనే ఉంటానన్న పావగడ ఎమ్మెల్యే వెంకటరమణప్ప

తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కర్ణాటకలోని పావగడ ఎమ్మెల్యే వెంకటరమణప్ప స్పష్టం చేశారు. మీడియాకు ఫోన్ చేసి ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నియోజకవర్గంలోని 246 గ్రామాల ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయబోనని చెప్పారు. బీజేపీ నేతలు ఎవరూ తనను సంప్రదించలేదని తెలిపారు.

డబ్బులు, మంత్రి పదవిని ఎరవేసి తనను బీజేపీలోకి లాగేందుకు యత్నాలు జరిగాయన్న వార్తల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని చెప్పారు. కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ సమక్షంలోనే తాను ఉన్నానని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Karnataka
congress
mla
venkataramanappa
pavagada
bjp
  • Loading...

More Telugu News