Uttar Pradesh: భారతీయులందరూ అవినీతిపరులే.. అది వారి రక్తంలోనే ఉంది: బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • అవినీతిని ప్రక్షాళన చేయడం అంత సులభం కాదు
  • ప్రధాని పోరాడుతున్నారు
  • అధికారులు చెప్పినట్టు సీఎం పాలిస్తున్నారు

భారతీయులందరూ అవినీతి పరులేనని, వారి రక్తంలోనే అవినీతి ఉందంటూ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వంద కోట్ల పై చిలుకు జనాభాలోనూ అవినీతి ఉందని, దీనిని ప్రక్షాళన చేయడం అంత సులువు కాదని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, గుజరాత్, ఏపీ, కేరళతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్‌లో నేరాల శాతం కూడా తక్కువేనన్నారు. దేశ ప్రధానే స్వయంగా అవినీతి అంతానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అక్కడితో ఆగని మంత్రి రాజ్భర్ ముఖ్యమంత్రి తన వివేకంతో పనిచేయడం లేదని, అధికారులు చెప్పినట్టు ఆయన రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

Uttar Pradesh
Yogi adithyanath
Om prakash rajbhar
  • Loading...

More Telugu News