Kalki Avatar: నేను విష్ణుమూర్తి అవతారాన్ని.. ఉద్యోగానికి ఎలా వస్తా?: గుజరాత్ ఇంజినీర్ గారి లీలలు

  • నేను రాముడు, కృష్ణుడి అవతారాలు కూడా ధరించా
  • నా తల్లి అహల్య, నా భార్య లక్ష్మీ అవతారాలు
  • భౌతికంగా విధులకు రాలేను

తాను విష్ణుమూర్తి అవతారాన్ని అని, తన తల్లి అహల్య, తన భార్య లక్ష్మీ అవతారాలని చెబుతూ ఓ ఇంజినీరు గత ఎనిమిది నెలలుగా విధులకు డుమ్మా కొడుతున్నాడు. ఇదేంటయ్యా? అని ప్రశ్నిస్తూ అతడికి నోటీసులు జారీ చేస్తే వచ్చిన సమాధానం విని అధికారులు విస్తుబోయారు. సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశతో పుట్టిన తాను ఉద్యోగం ఎలా చేస్తానని, ఆధ్యాత్మిక సాధనకు విధులు అడ్డొస్తున్నాయని, అందుకే రావడం లేదని వివరణ ఇచ్చాడు.

గుజరాత్‌లోని వడోదరలతో సర్దార్ సరోవర్ నర్మదా పునర్‌వాస్వత్ ఏజెన్సీ (ఎస్ఎస్‌పీఏ)లో పనిచేస్తున్న సూపరెంటెండింగ్ ఇంజినీరు రమేష్ చంద్ర ఫెటార్ కథ ఇది. తాను రాముడు, కృష్ణుడి అవతారాలు కూడా ధరించానని, తన తల్లి అహల్య, తన భార్య లక్ష్మీ అవతారాలని, కుటుంబం మొత్తం భగవత్ అంశంతో పుట్టిన వాళ్లమేనని చెబుతూ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాడు. విశ్వకల్యాణం కోసం వర్షం కోసం సాధన చేస్తుంటే ఉద్యోగం గోల ఏంటంటూ అసహనం వ్యక్తం చేశాడు. తాను భౌతిక రూపంలో విధులకు హాజరు కాలేనని చెప్పడంతో ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో తెలియక సదరు కంపెనీ ఆలోచనలో పడిపోయింది.

Kalki Avatar
Office
Gujarat
engineer
  • Loading...

More Telugu News