cuba: క్యూబాలో కుప్పకూలిన విమానం.. వందమందికి పైగా దుర్మరణం

  • టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం
  • విమానంలో 114 మంది
  • మృతుల్లో ఐదుగురు చిన్నారులు

క్యూబాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 114 మందితో  హవానా నుంచి హెల్గెయిన్ వెళ్తున్న బ్లూ పనోరమా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం బయలుదేరిన కాసేపటికే కుప్పకూలింది. ప్రమాదంలో వందమంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విమానంలో మొత్తం 105 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు విమానం కూలినట్టు తెలుస్తోంది. విమాన శకలాలు 20 కిలోమీటర్ల మేర ఎగిరిపడ్డాయి. మృతదేహాలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నట్టు క్యూబా అధ్యక్షుడు డియాజ్ కేనల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. కాగా, తీవ్రంగా గాయపడిన నలుగురు మహిళలను ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరు తర్వాత ప్రాణాలు విడిచారు. మిగతా ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News