Karnataka: కర్ణాటకలో ‘గాలి’ బేరసారాల వ్యవహారం ఆడియో బహిర్గతం!

  • రేపు బలపరీక్ష చేసుకోనున్న బీజేపీ
  • ప్రతిపక్ష, విపక్ష పార్టీల అభ్యర్థులకు వల! 
  • మద్దతిస్తే లైఫ్ సెటిల్ చేస్తానంటూ బసన్నగౌడ్ తో బేరసారాలు
  • ఎమ్మెల్యేలు రాజీవ్, శివన్న గౌడల లైఫ్ సెటిల్ చేశానన్న ‘గాలి’!
  • ఈ ఆడియో టేప్ ను బయటపెట్టిన కాంగ్రెస్ పార్టీ నేత ఉగ్రప్ప

కర్ణాటక అసెంబ్లీలో రేపు బలపరీక్ష చేసుకోనున్న బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి ప్రలోభపెడుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రతిపక్ష, విపక్ష పార్టీల అభ్యర్థులతో గాలి జనార్దన్ రెడ్డి బేరసారాలు సాగిస్తున్న వ్యవహారానికి సంబంధించిన ఆడియో బహిర్గతమైంది.

రాయచూర్ రూరల్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్నగౌడ్ తో గాలి జనార్దన్ రెడ్డి బేరసారాలాడటం ఈ ఆడియోలో ఉన్నట్టు సమాచారం. యడ్యూరప్పకు మద్దతిస్తే లైఫ్ సెటిల్ చేస్తానంటూ బసన్నతో గాలి చెబుతున్న ఈ ఆడియో టేప్ ను కాంగ్రెస్ పార్టీ నేత ఉగ్రప్ప విడుదల చేశారు. ఎమ్మెల్యేలు రాజీవ్ గౌడ, శివన్న గౌడల లైఫ్ సెటిల్ చేశానని ఇందులో 'గాలి’ పేర్కొనడం గమనార్హం. ఇందుకు బసన్నగౌడ్ ప్రతిస్పందిస్తూ, ‘మీ (గాలి)పై నాకు గౌరవం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ద్రోహం చేయలేను’ అంటున్నట్టు ఆ ఆడియోలో వుంది.

Karnataka
gali janardhan
  • Error fetching data: Network response was not ok

More Telugu News