yeddyurappa: సీఎంగా రేపు కుమారస్వామి ప్రమాణస్వీకారం చేస్తారు: జేడీఎస్ నేత బస్వరాజ్ జోస్యం

  • రేపటి బలపరీక్షలో యడ్యూరప్ప ఓడిపోతారు
  • బీజేపీ చేస్తున్న కుట్రలు ఫలించబోవు
  • బీజేపీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు

రేపు సాయంత్రం జరగనున్న బలపరీక్షలో యడ్యూరప్ప ఓడిపోతారని జేడీఎస్ ఎమ్మెల్సీ బస్వరాజ్ తెలిపారు. ఆ వెంటనే కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ఫలించబోవని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పటికీ తమను కాకుండా బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని... కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. 

yeddyurappa
kumaraswamy
baswaraj
karnataka
floor test
  • Loading...

More Telugu News